ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యేది ఆ పండగకేనా? టాలీవుడ్ టాక్

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యేది ఆ పండగకేనా? టాలీవుడ్ టాక్

0
35

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది.. ఇక అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల చేయాలి అని ఎంతో ప్లాన్ చేశారు…. కాని కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా విడుదల ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు..ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్ర .. చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర రెండూ కూడా విభిన్నమైనవే. ఈ సినిమా చూడాలి అని ఇటు దేశ వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు.

 

పాన్ ఇండియా చిత్రం ఇది, సుమారు 400 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను, దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇంకా షూటింగ్ కొంత భాగం ఉంది.. ఈ సమయంలో కోవిడ్ రావడంతో మరింత ఆలస్యం అవుతోంది… అయితే అనుకున్న సమయానికి సినిమా వస్తుందా రాదా అనే అనుమానం చాలా మందిలో ఉంది.

 

విడుదల తేదీని వాయిదా వేసే విషయంపై దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి… అయితే దసరా దాటితే మరే సమయంలో సినిమా వస్తుంది అంటే వచ్చే ఏడాది ఇక సంక్రాంతికి అని టాక్ నడుస్తోంది, అయితే ఈ సమయంలో సినిమాకి మంచి వసూళ్లు వస్తాయి అని చూస్తున్నారు..చూడాలి దీనిపై ప్రకటన వస్తుందా లేదా అనేది.