25 రోజుల్లో జగన్ మరో కీలక ప్రకటన

25 రోజుల్లో జగన్ మరో కీలక ప్రకటన

0

ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాలనతో దూసుకుపోతున్నారు.. అయితే ఆయన నిర్ణయాలు ప్రజలకు నచ్చుతున్నా ప్రతిపక్షాలకు మాత్రం నచ్చడం లేదు, ముఖ్యంగా ఇసుక అంశం పెను దుమారం రేపింది, తాజాగా ఆయన అమరావతి పై కూడా కీలక నిర్ణయం తీసుకోవాలి అని పిలుపు వస్తోంది, ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతి పనులు ఆగిపోయాయి అని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక పరిపాలన వికేంద్రీకరణ చేస్తారు అని అందరూ భావిస్తున్నారు.. అయితే రాజధాని మారుస్తారు అని మరో వార్త వినిపిస్తోంది.. ముఖ్యంగా వైసీపీ నేతలు చేసే కామెంట్లు వివిధ రకాల ప్రకటనతో కాస్త డైలమాలో ఉన్నారు అందరూ.. అందుకే పలు కంపెనీలు కూడా వెనక్కి వెళుతున్నాయి అని అంటున్నారు.. అయితే ఈ రాజధాని విషయంలో ఎవరు ఎన్ని మాటలు అంటున్నా, జగన్ మాత్రం దీనిపై ఎలాంటి మాట మాట్లాడటం లేదు.

గతంలో జగన్ సర్కారు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమగ్ర నివేదికను రూపొందించినట్టు తెలిసింది. వీరు సీఎం జగన్ కు ఈ నివేదికను అందించడానికి రెడీ అయ్యారట.. దీంతో జగన్ దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారట. దీనిపై డిసెంబర్ 15 నుంచి 20 లోపు జగన్ కీలక ప్రకటన చేస్తారు అని తెలుస్తోంది.