3 రాజధానులు వెనుక జగన్ కొత్త ప్లాన్ ఇదే

3 రాజధానులు వెనుక జగన్ కొత్త ప్లాన్ ఇదే

0

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంది.. పథకాలు కూడా అమలు చేశారు. అలాగే ఏపీ రాజధాని ఏమిటి అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు.. తాజాగా జగన్ రాజధాని విషయంపై క్లారిటీ ఇచ్చారు.
దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని, మనం కూడా మారాలని మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు రావొచ్చేమో అని సీఎం జగన్ అన్నారు. దీనిపై కమిటీ వేశామని అది మరో వారంలో వస్తుంది అని సీఎం తెలిపారు.

ఏపీకి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉంది అన్నారు.. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కనుక ఏర్పాటు చేస్తే ఖర్చు ఏమీ ఉండదని, అక్కడ అన్నీ ఉన్నాయని, మెట్రో రైల్ వస్తే సరిపోతుందని చెప్పారు. దీంతో అక్కడ సులువుగా డవలప్ మెంట్ చేయవచ్చు అని చెబుతున్నారు.

అయితే హైకోర్టు కర్నూలుకు వెళ్లవచ్చు అని చెప్పారు, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఉండే అవకాశం ఉంటుంది అని అన్నారు, అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది అమరావతి చుట్టుపక్కల భూములు కొనడంతో కేవలం కొందరికి మాత్రమే ఇది లాభం చేకూర్చేలా ఉంది.. అలాగే అన్నీ ప్రాంతాలు డవలప్ అవ్వాలి కాబట్టి జగన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది. ఓ పక్క సీమ ప్రాంతం అలాగే ఉత్తరాంధ్రా కూడా వెనుకబాటున ఉంది అనే విమర్శలకు ఈ నిర్ణయం కచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది అంటున్నారు మేధావి వర్గం.