4న సందడి చేయనున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్

4న సందడి చేయనున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్

0

మెగా హీరో సాయిధరమ్ తేజ్ , రాశి ఖన్నా జంటగా ప్రతిరోజూ పండగే సినిమా రూపొందింది. ఇక ఈ సినిమా గురించి మంచి బజ్ సోషల్ మీడియాలో ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ సినిమాని సక్సస్ లు కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్న దర్శకుడు మారుతి దర్శకత్వం వహించారు, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను నిర్మించారు. సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు.

అయితే మరో 18 రోజుల సమయం మాత్రమే ఉంది. పబ్లిక్ లో మంచి టాక్ అయితే నడుస్తోంది .మరి సినిమా ట్రైలర్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురుచూస్తున్నారు.. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ డిసెంబర్ 4వ తేదీని ఖరారు చేశారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో రావు రమేశ్ మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

మొత్తానికి మరో రెండు రోజుల్లో మెగా సినిమా ట్రైలర్ షేక్ చేయనుంది టాలీవుడ్ ని…గతంలో సాయిధరమ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా నటించిన సుప్రీమ్ భారీ విజయాన్ని నమోదు చేసింది.. మరో హిట్ కోసం ఈ పెయిర్ ఇక వెండితెరపైకి రానుంది. మొత్తం రూరల్ కథతోనే చిత్రం తెరకెక్కించారట. కుటుంబ కథా చిత్రంగా ఇది వస్తోంది వెండితెరపైకి.