67 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి వారెవరంటే

67 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి వారెవరంటే

0

అవును వారు ఇష్టపడ్డారు, ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరూ చెప్పలేరు.. అలాగే ప్రేమకి వయసు తారతమ్యాలు ఉండవు టీనేజ్ లోనే కాదు కాటికి కాళ్లు చాపిన సమయంలో కూడా ప్రేమ పుట్టవచ్చు…నిజమే మంచి వయసులోనే కాదు చివరి సమయంలో కూడా ప్రేమ కోసం తప్పించేవారు చాలా మంది ఉంటారు…కూతుళ్లకి మనవళ్లకి పెళ్లి చేయాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకునే తాతలు బామ్మలు ఉంటారు.

ఆయనకు 67 సంవత్సరాలు , ఆమెకు 65ఏళ్లు.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఇష్టపడటమే కాదు పెళ్లితో ఒకటయ్యారు . వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కేరళలోని ఓ వృద్ధాశ్రమం వేదికైంది. .. కేరళలోని తిస్సూరు ప్రాంతానికి చెందిన కొచానియన్ , లక్ష్మీ అమ్మాళ్ భర్త దగ్గర గతంలో అసిస్టెంట్గా పని చేసేవాడు.

అయితే 21ఏళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో అక్కడ పని మానేసిన కొచానియన్.. కేటరింగ్ వ్యాపారం ప్రారంభించాడు. కొన్నేళ్ల క్రితం కొచానియన్ భార్య కూడా మరణించింది. దీంతో కుటుంబ సభ్యులకు ఆయన భారమయ్యాడు. ఈ క్రమంలో వయనాడులోని ఓ వృద్ధాశ్రమంలో ఆయనని చేర్పించారు.

తర్వాత కొన్ని కారణాలతో రామవర్మాపురంలోని వృద్ధాశ్రమానికి మార్చడంతో అక్కడ లక్ష్మీ అమ్మళ్ను కలిశాడు వారిద్దరికి ముందే పరిచయం ఉండటంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. వెంటనే వీరికి దండలు మార్చి పెళ్లి చేశారు మరి వారి లైఫ్ బాగోవాలి అని అందరూ కోరుకుంటున్నారు, నిజంగా ఈ వయసులో ప్రేమ ఆ పై పెళ్లి ఇంట్రస్టింగ్ అంటున్నారు కేరళ యువత.