ఇండియాలో కొత్తగా 9062 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసులు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.

గడిచిన 24 గంటల్లో 9,062 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 36 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,27,134కు చేరింది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,05,058 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 4,42, 65777

క్రియాశీల కేసులు: 1,05,058

మొత్తం మరణాలు: 5,27,134

కోలుకున్నవారు: 43,54,064

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here