జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం..ఎన్డీయేకు జేడీయూ గుడ్ బై?

0

బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పనున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్డీయే నుంచి జేడీయూ తప్పుకోవడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన గైర్హాజరు ఈ వార్తలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే జరిగితే జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అయితే ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి బీహార్ లో కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో నీతిష్ కుమార్ ఉన్నట్లు సమాచారం. ఆ దిశగా నీతిష్ చకచకా పావులు కదుపుతున్నారు.

అయితే ఎన్డీయేలో కొనసాగాలా.. వైదొలగాలా అనే దానిపై మరికొద్దిరోజుల్లోనే తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళవారం సమావేశమయ్యేందుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here