ఛీ…ఛీ ఇదేక్కడి జీవితం కూతురుకు మత్తుమందు ఇచ్చి ఏడాదిగా అత్యాచారం…

ఛీ...ఛీ ఇదేక్కడి జీవితం కూతురుకు మత్తుమందు ఇచ్చి ఏడాదిగా అత్యాచారం...

0

అమ్మ జీవితాన్ని ఇస్తే నాన్న జీవితం విలువ నేర్పుతాడు… అలాంటి నాన్న బాధ్యతా రహింతగా మారాడు… తాను పుట్టించుకున్న కూతురుకి ఏడాదికి పైగా మత్తుమందు ఇస్తూ అత్యాచారానికి ఒడిగట్టాడు…ఈ సంఘటన మధ్యప్రదేశ్ శివపూర్ లో జరిగింది…

ఓ భార్య భర్తకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. గతంలో భార్య భర్త ప్రవర్తన నచ్చక తన పిల్లలని వదిలి పుట్టింటికి వెళ్లి పోయింది… దీంతో భార్య దూరం కావడంతో తన కామవాంఛన తీర్చుకునేందుకు 16 సంవత్సరాల కూతురికి మత్తుమందు ఇచ్చి ప్రతీ రోజు అత్యాచారం చేసేవాడు…

అంతే కాదు వీడియోలు తీసి మిగిలిన ఇద్దరి కూతురులకు కూడా చూపించేవారు…దీంతో ఈ చిన్నారులు నాన్న అంటే భయపడుతుండేవారు… ఈ క్రమంలో చిన్న అమ్మాయికి ఓ ఇంట్లో పని కుదిరింది… ఇంటియజమానురాలు తన తండ్రి గురించి అడగగా అప్పుడు ఆ చిన్నారు భయపడింది…

దీంతో అనుమానం వచ్చిన యజమానురాలు అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది… చిన్నారి నిజం చెప్పడంతో ఆమె అవాక్కైయింది… వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది… పోలీసులు ఆ కామాందుడిని అదుపులో కి తీసుకున్నారు…