ఓ నత్త ఆమె జీవితాన్నే మార్చేసింది – లక్ అంటే ఇదే

0

నిజమే ఎప్పుడు ఎవరికి ఎలా అదృష్టం వస్తుందో తెలియదు, అయితే ఇక్కడ స్టోరీ వింటే నిజం అనిపిస్తుంది.. ఓ మహిళ తనకు వచ్చిన అదృష్టాన్ని తెలుసుకుని ఎంతో ఆనందించింది… ఒక చిన్న నత్త ఈ మహిళ జీవితాన్నే మార్చేసింది. ఇంతకీ ఆమెకి దొరికింది ఏమిటి అసలు ఆమె స్టోరీ ఎలా మారింది అనేది చూద్దాం.

బ్యాంకాక్ లో కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే ఓ మహిళ స్థానిక చేపల మార్కెట్ కు వెళ్ళింది… అక్కడ దాదాపు 160 రూపాయల విలువ చేసే నత్తలు కొనుగోలు చేసింది… వాటిని ఇంటికి తీసుకువచ్చి వండటానికి శుభ్రం చేస్తోంది.. ఈ సమయంలో అందులో నుంచి ఓ ఆరంజ్ బాల్ బయటకు వచ్చింది….దానిని తన తల్లికి చూపించింది.

ఆ తల్లి దానిని చూసి ఆనందించింది… ఎందుకు అంటే ఆమెకు దొరికింది ఓ అరుదైన ముత్యం….ఇక దీనిని స్దానికంగా మార్కెట్లో చూపించారట… అయితే ఇది సుమారు 1.80 కోట్ల రూపాయల విలువ ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, ఆమె తల్లికి ఉన్న జబ్బుకి ఈ నగదుతో వైద్యం చేయిస్తాను అని మిగిలిన సొమ్ముతో సొంత ఇళ్లు వ్యాపారం పెట్టుకుంటాము అని ఆమె చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here