భార్య అంటే ఇంత ప్రేమా..భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య

0

ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఇద్దరు వ్యక్తుల మధ్య విడదీయలేని బంధానికి పునాది. అయితే ఇదే ప్రేమ రెండు కుటుంబాల మధ్య తీరని విషాదాన్ని మిగులుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అనేక కారణాలతో భార్యను వదిలి భర్త ఉండలేక, భర్త తోడు లేక భార్య ఆ దుఃఖాన్ని భరించలేక ఆవేదనకు గురవుతారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఎడబాటు తట్టుకోలేక కుమిలిపోతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.

రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి పుట్ట సురేష్.. అదే గ్రామానికి చెందిన నిర్మల అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం భార్య నిర్మల అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించింది. భార్య అకాల మరణాన్ని సురేష్ తట్టుకోలేకపోయాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య తోడు లేక లోలోపల కుమిలిపోయాడు. భార్య లేని జీవితం తనకు వద్దు అంటూ..భార్య నిర్మల సమాధి వద్ద భర్త సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

ఈనెల రెండవ తారీఖున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యాప్రయత్నం చేసిన సురేష్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతి ప్రతి ఒక్కరిచేత కంటతడి పెట్టిస్తున్నాయి.

సురేష్ ఫైల్ ఫోటో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here