ఆ సినిమాకి ఒకే చెబుతారా తారక్ మాట కోసం వెయిటింగ్

ఆ సినిమాకి ఒకే చెబుతారా తారక్ మాట కోసం వెయిటింగ్

0

ఇప్పుడు సౌత్ ఇండియాలో బయోపిక్ ల హవా నడుస్తోంది.. ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతోంది. ఇందులో కంగనా రౌనౌత్ ప్రధాన పాత్రధారురాలిగా చేస్తున్నారు.. ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై అనేక వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ఇవి టాలీవుడ్ వరకూ వచ్చాయి అని చెప్పాలి.

ఈసినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. చాలా మంది లెజెండరీ యాక్టర్లని తీసుకోవాలి అని చిత్ర యూనిట్ భావిస్తున్నారు, ఇక ఈ చిత్రంలో ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు పాత్ర కూడా ఉంది అని తెలుస్తోంది.. ఇప్పుడు ఈ పాత్రకు తగ్గ వ్యక్తి.. జూనియర్ ఎన్టీఆర్ అని భావించిన చిత్ర యూనిట్.. ఆయనతో సంప్రదింపులు మొదలు పెట్టారట.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్నాడు తారక్, అలాగే లుక్ కోసం ఫుల్ గా మేకోవర్ అయ్యాడు, ఈ చిత్రం కోసం డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు, మరి ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన నటిస్తారా లేదా అనేది చూడాలి..