ఆ కారణంతోనే జగన్ ఆఫర్ ను తిరస్కరించిన పోసాని

ఆ కారణంతోనే జగన్ ఆఫర్ ను తిరస్కరించిన పోసాని

0

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా పోసాని కృష్ణమురళి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు… రాజకీయంగా అదే గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని… జగన్ పార్టీ స్ధాపించినప్పటినుంచి వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా…

ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి పదవులు ఆశించలేదు… దీంతో పోసాని సహానటుడు పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి దక్కింది… ఈ నేపథ్యంలో పదవుల గురించి పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

జగన్ రాజ్యసభ ఎంపీతో సహాపలు పదవులు ఆఫర్ చేసినప్పటికీ తాను వాటన్నింటిని తిరస్కరించానని అన్నారు… అంతేకాదు తాజాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్ రెడ్డి ద్వారా తనకు ఏదో ఒక పదవి తీసుకోవల్సిందిగా రాయబారం సైతం పంపినట్లు తెలిపారు… అయినప్పటికీ తాను పదవులకు దూరంగా ఉన్నానని అన్నారు..