ఆ షో నుంచి తప్పుకున్న ప్రదీప్ షాక్ లో అభిమానులు

ఆ షో నుంచి తప్పుకున్న ప్రదీప్ షాక్ లో అభిమానులు

0

బుల్లితెరలో యాంకర్ ప్రదీప్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు, ఆయన కనిపిస్తే నవ్వులే… అంతేకాదు యాంకరింగ్ చేయడంలో ప్రదీప్ దిట్ట, ఆ కార్యక్రమం షోని సరదాగా ముందుకు సాగేలా చేస్తాడు.. జోక్ లు సరదా మాటలతో ప్రదీప్ చేసే యాంకరింగ్ కు అందరూ ఫిదా అవుతారు, రెండు తెలుగు స్టేట్స్ లో అభిమానులు కోట్ల మంది ఉన్నారు.

పలు టీవీ షోలలో ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇటు స్టేజ్ పై తోటి సభ్యులు .. అటు ఆడియన్స్ ఎవరూ హర్ట్ కాకుండా మంచి సమయస్ఫూర్తితో మాట్లాడటం ప్రదీప్ ప్రత్యేకత. ఇప్పటి వరకూ ఏ వివాదాలు లేకుండా దూసుకుపోతున్నాడు ప్రదీప్.
అలాంటి ప్రదీప్ కి మంచి క్రేజ్ తెచ్చిన షోలలో ఢీ ఒకటి.

మరి కొద్దిరోజులుగా ఆ షో నుంచి ప్రదీప్ తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. వచ్చేవారానికి సంబంధించిన ప్రోమోలో ప్రదీప్ కనిపించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే నిజంగా ఆయన అందులో కనిపించరా అనే డౌట్ అభిమానుల్లో కలుగుతోంది.. ప్రదీప్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. ఆ సినిమా షూటింగు కారణంగానే ఆయన ఈ షో నుంచి తప్పుకున్నాడని అంటున్నారు.. త్వరలో ఆయన హీరోగా రానున్నారట అందుకే ఈ డెసిషన్ తీసుకున్నారట ప్రదీప్.