ఆ వైసీపీ ఎమ్మెల్యే ఏడుపు చూడలేకపోతున్నా…. నాగబాబు

ఆ వైసీపీ ఎమ్మెల్యే ఏడుపు చూడలేకపోతున్నా.... నాగబాబు

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు… తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నసంగతి తెలిసిందే… దీనిపై అంబటి రాంబాబు స్పందించారు…

పవన్ కళ్యాణ్ కు రాజకీయ స్థిరత్వం వ్యక్తిత్వం లేదని అన్నారు… రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి నమ్ముకుని…. కుక్క తోకపట్టుకుని ఈదుతామంటే ఈదమనేచెబుతామని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు… ప్రత్యేక హోదా గురించి ఆ పార్టీని నిలదీయాల్సిందిపోయి ఆ పార్టీతోనే చేతులు కలుపుతారా అని ప్రశ్నించారు…

గతంలో పాచిపోయాన లడ్డులు ఇచ్చారన్న పవన్ కు ఇప్పుడు అదే పార్టీ నాయకులు కొత్త లడ్డులు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు… ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు… వై సీపీ పార్టీ మరియు అంబటి రాంబాబు గారి దుఃఖాన్ని చూడలేకపోతున్నా అని నాగబాబు ఎద్దేవా చేశారు…