అబ్బాయిలకి పిల్లలు పుట్టకపోవడానికి వీర్యంలో ప్రధాన 10 కారణాలు ఇవే

అబ్బాయిలకి పిల్లలు పుట్టకపోవడానికి వీర్యంలో ప్రధాన 10 కారణాలు ఇవే

0

పిల్లల కోసం చూసేవారు పరీక్షల కోసం వెళుతూ ఉంటారు, అయితే వీర్యం పరిమాణం గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది ..ముఖ్యంగా వీర్య పరిమాణం సుమారుగా 1.5 మిల్లీ లీటర్ల నుంచి 2 మిల్లీ లీటర్ల పరిమాణం ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి. వారికి పిల్లలు పుట్టడం కష్టం, అంతేకాదు గర్భధారణకు అవసరమైన వీర్యకణాల సంఖ్య, ఒక మిల్లీలీటరుకు 15 మిలియన్ల నుంచి 30 మిలియన్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉన్నట్లు చెబుతారు డాక్టర్లు

ఇక పురుషుడికి వీర్యం రంగు తెల్లగా ఉండాలి. పచ్చగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, ఎర్రగా ఉంటే వీర్యంలో రక్తం కలుస్తున్నట్టు ఇలా ఉంటే కచ్చితంగా గర్భం రాదు, వీర్యం జిగటగా ఉండాలి. నీళ్లలా ఉంటే హర్మోన్ల సమస్య ఉందని అర్థం. ఇలాంటి పల్చని వీర్యం గర్భధారణ జరగనివ్వదు.

ఇక చిక్కగా ఉండే వీర్యం గది ఉష్ణోగ్రత దగ్గర 15 నిమిషాల్లో కరిగిపోవాలి. ఇలా జరగకపోతే వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉందని అనుకోవాలి. ఇన్ఫెక్షన్ గర్భధారణకు ప్రధాన అడ్డంకి..వీర్యంలో చీము కణాలు ఉంటే, ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి.
వీర్యంలో కదిలే శుక్రకణాలు 32శాతం ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉందని భావించాలి.

వీర్యకణాలు స్వతంత్రంగా కదలకుండా, ఒకదానికి మరొకటి అతుక్కుపోయి ఉండవచ్చు. ఇందుకు ఇన్ఫెక్షన్లే కారణం.
వృషణాల ఉష్ణోగ్రత ఎక్కువగా లేకుండా చూసుకోవాలి టైట్ బట్టలు వేసుకోవద్దు, దీని వల్ల వృషణాలు దెబ్బతింటాయి.మద్యం పాన్ గుట్కా డ్రగ్స్ సిగరెట్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.