అభివృద్ధి వికేంద్రీకరణకు లోకేశ్ జై కొట్టారు… కానీ

అభివృద్ధి వికేంద్రీకరణకు లోకేశ్ జై కొట్టారు... కానీ

0

తాజాగా ఉండవల్లి సెంటర్ లో మంగళగిరి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు… ప్రజా బ్యాలెట్ టీడీపీ నేత మాజీ మంత్రి నారాలోకేశ్ పాల్గొన్నారు… ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఓటు వేసానని తెలిపారు… అమరావతిని కాపాడుకోవాలనే కాంక్ష ప్రజా బ్యాలెట్ ద్వారా బయటపడిందని తెలిపారు.

ప్రజా బ్యాలెట్ కు పెద్ద ఎత్తున మహిళలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు… ఇప్పటికైనా ఈ దున్నపోతు ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఆరోపించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే మా నినాదం అని లోకేశ్ అన్నారు..

అబద్దాలు, ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి అవిభక్త కవలలుఅని పసి బిడ్డగా ఉన్నప్పుడే అమరావతిని చంపేయడానికి వైసీపీ చేసిన కుట్రలు అందరికి తెలిసినవే అని ఈరోపించారు..