చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఆదినారాయణ రెడ్డి యూటర్న్

చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఆదినారాయణ రెడ్డి యూటర్న్

0

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టాపిక్ హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షంలో చేరడంతో ఆయన తన రాజకీయ భవిష్యత్ ను ద్రుష్టిలో ఉంచుకుని బీజేపీలో చేరాలని చూస్తున్నారు.

ఇదే విషయమై ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అరగంటపాటు చర్చలు జరిపిన తర్వాత ఆదినారాయణ రెడ్డి తన మనసు మార్చుకున్నట్లు సమాచారం వస్తోంది. పార్టీ మారాలని ఆది డిసైడ్ అయిన క్రమంలో చంద్రబాబు నాయుడు ఆయన అవసరాలను గూర్తించి పలు హామీలను ఇచ్చారట.

దీంతో ఆయన ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కే ముందు తన టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. కాగా చంద్రబాబు నాయుడుతో సమావేశం కాకముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఆది నారాయణ రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన దరిదాపు బీజేపీ ఖండువా కప్పుకోవడం ఖాయం అనే నిర్ణయానికి తమ్ముళ్లు వచ్చారు.