మహేష్ బాబుకి వైయస్ జగన్ అదిరిపోయే గిఫ్ట్

మహేష్ బాబుకి వైయస్ జగన్ అదిరిపోయే గిఫ్ట్

0

ప్రిన్స్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఈ సంక్రాంతికి మన ముందుకు వస్తున్నారు.. అయితే ఆయన చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు…మరీ ముఖ్యంగా సంక్రాంతి బరిలో అల వైకుంఠపురంలో సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఉన్నాయి, దీంతో మరింత హైప్ వార్తలు వస్తున్నాయి ..ఏ చిత్రం సూపర్ సక్సెస్ అవుతుంది అని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే ఒక్క రోజు గ్యాప్ లో రెండు పెద్ద చిత్రాలు విడుదల అవుతున్నాయి…. తాజాగా ఏపీలో ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ నిర్మాత అనిల్ సుంకర ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. దీనిపై ఆయన ఎలాంటి రిప్లై ఇస్తారా అని చూసిన చిత్రయూనిట్ కు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంచి న్యూస్ వినిపించారు..

ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రతి రోజు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.. దీంతో రోజుకి ఆరు షోలు వేసుకునే వెసులుబాటు వచ్చింది. ఏపీ అంతా రోజుకి ఆరు షోలు చొప్పున పండుగ పూర్తి అయ్యేవరకూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది.