అజిత్ హైదరాబాద్ టూర్ ఎందుకంటే

అజిత్ హైదరాబాద్ టూర్ ఎందుకంటే

0

తమిళ సూపర్ హీరో అజిత్ తన సినిమాలను మరింత వేగం పెంచారు అనే చెప్పాలి.. ఆయన ఎక్కువగా తన సినిమాలు సౌత్ లో షూటింగ్ చేయడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో షూటింగ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇక్కడ షూటింగ్ ని ఆయన బాగా ఇష్టపడతారు.ముఖ్యంగా భారీ సెట్టింగ్స్ వేసి షూటింగ్ చేయాల్సి వస్తే వెంటనే రామోజీఫిల్మ్ సిటీకి వచ్చేస్తుంటారు. ఆయన గతంలో చేసిన చాలా సినిమాలు రామోజీఫిల్మ్ సిటీ లోనే చిత్రీకరణ జరుపుకున్నాయి. తాజాగా
వాలిమై షూటింగ్ కూడా అక్కడే చేయనున్నారట.
డిసెంబర్ 13 నుండి ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో సీనియర్ నటులు చాలామంది పాల్గొననున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో అజిత్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారట. శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది వేసవికి చిత్రం విడుదలకానుంది.