ఆకాశాన్నంటుతున్న వంటనూనె ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే

ఆకాశాన్నంటుతున్న వంటనూనె ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే

0

మనం ఏ వంట చేసుకున్నా నూనె మాత్రం చాలా అవసరం.. నూనె లేకుండా వంట పూర్తి కాదు.. కాని ఇప్పుడు వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరల్లో వాడే వేరుశనగ, ఆవ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గడిచిన రెండు నెలలుగా చూస్తే తగ్గుదల ఎక్కడా కనిపించడం లేదు.

సోయాబీన్, పొద్దుతిరుగుడు ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. అయితే ఇలా నూనె ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి, ముఖ్యంగా పామాయిల్ భారతదేశంలోకి దిగుమతి అవుతుందనే విషయం తెలిసిందే , నాలుగు నెలల లాక్డౌన్ కారణంగా, మలేషియా వంటి దేశాలలో దాని ఉత్పత్తి తగ్గింది. అంతే కాదు అక్కడ ప్రొడక్షన్ సాగు తగ్గింది, అలాగే విత్తనాల ధరలు పెరిగాయి.

ప్యాకేజింగ్ అలాగే ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో పామాయిల్ ధరలు పెరుగుతున్నాయి.పామాయిల్ నూనె ధర ఏడాది క్రితం 75.25 గా ఉండేది, ఇప్పుడు అది కిలోకు 102 కి పెరిగింది… ఇలా రేట్లు కొనసాగితే వచ్చే రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అధికారులు, దీనిపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది .. పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించాలి అని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here