అక్కినేని అఖిల్ ఆయనపైనే హోప్స్ పెట్టుకున్నాడా

అక్కినేని అఖిల్ ఆయనపైనే హోప్స్ పెట్టుకున్నాడా

0

అక్కినేని నట వారసుడు అఖిల్ హిట్ కోసం చూస్తున్నాడు, సరైన హిట్ కోసం నాగార్జున కూడా కొడుకు సినిమాల కథలు వింటున్నారు. అయితే యావరేజ్ బేస్ నుంచి సూపర్ హిట్ అవ్వాలి అని నాగ్ సన్నిహితులు అభిమానులు కూడా అఖిల్ సినిమాలపై ఆశలు పెట్టుకుంటున్నారు. అందుకే ప్రతీ కథని నాగ్ కూడా వింటూ అఖిల్ కు సలహాలు ఇస్తున్నారు.

తాజాగా అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటోంది.. ఇందులో అఖిల్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకూ తీసిన లవ్ ట్రాక్స్ చాలా బాగా వచ్చాయి అంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందట.

డైరెక్టర్ భాస్కర్ బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా సినిమా తీస్తున్నారట. ఆయన గత మార్క్ లు ఈ చిత్రంలో చూపిస్తున్నారు అని అంటున్నారు.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి ఇది ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.