వైసీపీని హర్ట్ చేసిన అఖిల ప్రియ

వైసీపీని హర్ట్ చేసిన అఖిల ప్రియ

0

ఏపీ టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియ తన భర్తపై నమోదు అయిన కేసుపై ఘటుగా స్పందించారు… తన భర్త భార్గవ రామ్ పై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు… తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… భార్గవరామ్ పై కేసు నమోదు అయిన తర్వాత ఎక్కడ ఉన్నారో తెలియడంలేదని తనకు టచ్ లో లేరని ఆమె అన్నారు…

తన భర్తపై నమోదు అయిన కేసు పెద్ద కేసు ఏం కాదని అది సివిల్ కేసు అని అందరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని అన్నారు… క్రషర్ లో భార్గవ్ కు భాగం ఉందని అన్నారు… ఎవరిపైనా దాడి చేయలేదని అన్నారు… ఒక వేల దాడి చేయాలని అనుకుంటే తాను మంత్రిగా ఉన్నప్పుడే దాడి చేసేవాళ్లము కదా అని ప్రశ్నించారు…

ఫ్యాక్షన్ నేపథ్యంలో నుంచి వచ్చిన తన ఫ్యామిలీ ఇలాంటి చిన్న కేసులకు బయపడదని అన్నారు… తాము పారి పోవాల్సిన అవసరం లేదని అఖిల ప్రియ స్పష్టం చేశారు వైసీపీ నాయకులు చిన్న కేసును పెద్ద కేసులా చేస్తున్నారని ఆమె ఆరోపించారు…