రాజశేఖర్ చేయనున్న సినిమా అక్కినేని హీరో చేస్తున్నాడా..!!

రాజశేఖర్ చేయనున్న సినిమా అక్కినేని హీరో చేస్తున్నాడా..!!

0

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ గరుడావెగా తర్వాత మంచి బజ్ క్రియేట్ చేసుకున్న కల్కి సినిమా తో ఎన్ని రోజులు కొనసాగించలేకపోయారు.. ఆ సినిమా ఫ్లాప్ తో అయన కెరీర్ మళ్ళీ మొదటికొచ్చింది.. ప్రస్తుతం అయన చేతిలో ఏ సినిమాలు లేవు..

అయితే ఇటీవలే తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తితో ఓ సినిమా చేయడానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ తమిళ నిర్మాత కూడా ముందుకొచ్చారు. దర్శక నిర్మాతలతో రాజశేఖర్, జీవిత రెండుమూడు సార్లు సమావేశం అయ్యారు.

స్క్రిప్ట్ నుండి డైలాగుల వరకూ అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నారు. రాజశేఖర్ పక్కన నందితా శ్వేతను హీరోయిన్ గా సెలక్ట్ కూడా చేశారు. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో సినిమా క్యాన్సిల్ అయింది. ఏమైందో ఏమో… రాజశేఖర్ ఆ సినిమా చెయ్యట్లేదు. కారణాలు తెలియవు గానీ, ఇప్పుడు కొత్త కథల కోసం రాజశేఖర్ చూస్తున్నారు. అయితే ఆ సినిమా ను అక్కినేని హీరో సుమంత్ హీరో గా రాబోతుందని అంటున్నారు..