అక్కినేని హీరోలతో మల్టీస్టారర్ -దర్శకుడు ఎవరంటే

అక్కినేని హీరోలతో మల్టీస్టారర్ -దర్శకుడు ఎవరంటే

0

దర్శకుడు అనిల్ రావిపూడి అద్బుతమైన చిత్రాలతో దూసుకుపోతున్నారు, మరీ ముఖ్యంగా ఆయన ఈ ఏడాది ప్రిన్స్ మహేష్ కు సరిలేరు నీకెవ్వరు చిత్రం అందించారు, ఈ సినిమా ఎంతో హిట్ అయింది.. ఇక తర్వాత ఎఫ్ 3 చిత్రం చేస్తారు అని అందరూ భావించారు, తాజాగా అనిల్ ఈ ప్లాన్ వేస్తున్న సమయంలో మరో చిత్రానికి రెడీ అవుతున్నారట.

అక్కినేని నాగార్జున, అఖిల్తో ఓ మల్టీస్టారర్ను ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు ఇటీవల అక్కినేని హీరోలకి ఈ కథ చెబితే చిన్న మార్పులతో స్టోరీకి ఒకే చెప్పారట, అయితే దర్శకుడు కూడా ఈ ప్లాన్ లో బిజీగా ఉన్నారు, ఇక ఈ సినిమా ఒకే అయితే ఎఫ్ 3 కంటే ముందు ఇది పట్టాలెక్కే అవకాశం ఉంది అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.

ఇక ఈ స్టోరీపై ఆయన టీమ్ వర్క్ చేస్తోంది, అయితే వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఈ సినిమా సెట్స్ పై పెట్టే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి, ఇక అఖిల్ నాగార్జునకి ఈ స్టోరీ సూపర్ సెట్ అవుతుంది అంటున్నారు చిత్ర యూనిట్, నిజంగా ఇది అక్కినేని అభిమానులకి స్వీట్ న్యూస్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here