అల్‌ఖైదా అగ్రనాయకుడు చనిపోయాడా? లేదా? సంచలనంగా మారిన తాలిబన్ల ప్రకటన

0

అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్‌ జవహరీ చనిపోయారా? లేదా? జవహరీని అమెరికా చంపినట్టు వస్తున్న వార్తలు నిజం కాదా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తలెత్తడానికి కారణం తాలిబన్ల ప్రకటనే. ఓ వైపు జవహరీని మట్టుబెట్టినట్టు అమెరికా స్వయంగా ప్రకటించింది.

కానీ తాలిబన్లు జవహరీ మృతి చెందలేదని ప్రకటించారు. జవహారీ చనిపోయినట్లు ఆధారాలు లేవని చెప్పారు. మృతిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. కాగా కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని చంపినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

కాబూల్‌లో జవహరీ చనిపోయినట్లు సంబంధించిన డీఎన్‌ఏ ఆధారాలు లేవని అమెరికా చెప్పింది. అమెరికా, తాలిబన్‌ల పరస్పర ప్రకటనలతో అల్‌ ఖైదా అధినేత అల్ జవహరీ మృతి మిస్టరీగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here