అలవైకుంఠపురం నుంచి భారీ సర్ప్రైజ్..!!

అలవైకుంఠపురం నుంచి భారీ సర్ప్రైజ్..!!

0

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అలవైకుంఠపురంలో.. జులాయి సన్నాఫ్ సత్యమూర్తి సినెమాలతర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడీ సినిమా నుంచి బన్నీ అభిమానులకి ఓ సప్రైజ్ ప్లాన్ చేశారు నిర్మాతలు.తాజాగా థమన్ ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ సినిమా ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో తమన్‌ మాత్రమే కనిపిస్తారా? లేక బన్ని కూడా దర్శనమిస్తారా? తెలియాలంటే ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే.

ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలకలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.