బిగ్ బాస్ లోకి అలీ ఎంట్రీ నిజమేనా..!!

బిగ్ బాస్ లోకి అలీ ఎంట్రీ నిజమేనా..!!

0

హౌస్‌మేట్స్‌కు సర్‌ప్రైజ్‌ ట్విస్ట్‌.. వెయిట్‌ అండ్‌ వాచ్‌ అంటూ విడదల చేసిన ఓ ప్రోమో.. ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అయితే అందులో ఉన్నది అలీ రెజా అని తెలిసిపోతూనే ఉంది. అలీ రెజా నామినేషన్స్‌లోకి వచ్చిన మొదటిసారే.. వెనుదిరిగిపోయాడు. అలీ ఎలిమినేషన్‌తో హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ కూడా షాక్‌కు గురయ్యారు.

అలీని తిరిగి బిగ్‌బాస్‌ ఇంట్లోకి తీసుకురావాలని అతని అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు.అయితే నేటి ఎపిసోడ్‌లో అలీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు విడుదల చేసిన ప్రోమో.. సోషల్‌మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది.

ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టకుండా.. అలీని హౌస్‌లోకి ఎలా తీసుకువస్తారు? అంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. అలీని తిరిగి ఇంట్లో ప్రవేశపెట్టాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా అని అంటున్నారు.