మంగళగిరి ఎమ్మెల్యే కొత్త ప్రయోగం అదుర్స్

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త ప్రయోగం చేశారు… ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు… రానున్న రోజుల్లో మంగళగిరి నియోజకవర్గం స్వచ్చ మంగళగిరిగా చేయాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టారు….

ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలిపారు… అంతేకాదు ఉచితంగా జ్యూట్ చేతి సంచులను కూడా పంపిణీ చేశారు రామకృష్ణా రెడ్డి…. రానున్న రోజుల్లో మంగళగిరిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు…

పర్యారవణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు జ్యూట్ సంచులను మాత్రమే ఉపయోగించాలని ఆయన తెలిపారు… కాగా రామకృష్ణా రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ది కోసం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటారు…