అలాంటి సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌ను – శ్రియ‌

అలాంటి సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌ను - శ్రియ‌

0

తెలుగు సినిమాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది న‌టి శ్రియ‌… ఆమె అగ్ర‌హీరోలు అంద‌రి సినిమాల్లో న‌టించింది, అంతేకాదు త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ ఏర్ప‌ర‌చుకుంది. ఇక ఈ అమ్మ‌డు ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉంది, మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉంది.

పెళ్లైన తర్వాత కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో శ్రియ నటించింది. అయితే, మంచి కథ దొరికితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని అంటోంది. అయితే ద‌ర్శ‌కులు నిర్మాత‌ల గురించి కొన్ని కీల‌క కామెంట్లు చేసింది, దర్శకనిర్మాతలు కొందరు మోసం చేస్తున్నారని ఆరోపించింది.

చెప్పే కథ ఒకటి… తీసే కథ మరొకటని మండిపడింది. ఇలాంటి అనుభవాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువవుతున్నాయని చెప్పింది. ఇక క‌ధ చెప్పే స‌మ‌యంలో కొంద‌రు ఒక‌టి రెండు లైన్లు చెబుతున్నారు, అలాంటి స్టోరీల‌కి నో చెబుతున్నా అంది శ్రియ. చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌ర‌ని, కాని ఆ పాట సినిమాకి బాగా ఇంపార్టెన్స్ ఉంటే చేయాల‌ని అందుకే, తాను చేశాను అని చెబుతోంది ఈ అందాల భామ‌.