అమాయక అమ్మాయిలను టార్గెట్ చేసిన బీటెక్ యువకుడు… ఆ తర్వాత ఏం చేసేవాడంటే

అమాయక అమ్మాయిలను టార్గెట్ చేసిన బీటెక్ యువకుడు... ఆ తర్వాత ఏం చేసేవాడంటే

0

ఏ తల్లి అయినా తన కుమారుడుని పెద్ద చదువులు చదివించి ఉన్నత స్థాయిలో చూడాలను కుంటుంది… బిడ్డ పై చదువుల కోసం రెక్కలు అరిగేలా కష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి తన కుమారుడి చదువుల అవసరాలకు సంపాదించిన మొత్తాన్ని తన దగ్గర పైసా ఉంచుకోకుండా పంపుతుంది… అలాగే తమిళనాడుకు చెందిన ఒక తల్లి అలాగే చేసింది…

తన కుమారుడు బీటెక్ చదివించి మంచి పొజీషన్ లో చూడాలనుకుంది.. కుమారుడు చదువుకు కావాల్సిన ఫీజులన్నింటిని తానే కట్టేది… కానీ కుమారుడు తల్లి కష్టాన్ని గుర్తించలేకపోయాడు… బీటెక్ లో చదువుతున్న సమయంలో సోషల్ మీడియాకు బానిస అయ్యాడు… సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను క్రీయేట్ చేసి తాను ఒక మంచి సీనియర్ యాక్టర్ అని నమ్మేలా ఫోటోలను పోస్ట్ చేసేవాడు…

అలా పోస్ట్ చేసి కొంతమంది అమ్మాయిల నంబర్లు తీసుకునేవాడు… పూర్తిగా నమ్మిన తర్వాత అమ్మాయిల న్యూడ్ ఫోటోలను వీడియోలను అడిగేవాడు వారు సెలబ్రెటీ మీద ఉన్న పిచ్చితో పంపేవారు… ఆ తర్వాత అధిక మొత్తంలో డబ్బులు వసులు చేసేవాడు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెధిరించేవాడు ఒక రోజు పుదుచ్చెరికి చెందిన ఒక యువతిని లైంగికంగా వేధించడంతో అసలు విషయం బయట పడింది.. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు…