ఆ ఎమ్మెల్యేకి ఇద్దరట..అనర్హత వేటు వెయ్యాలట…

ఆ ఎమ్మెల్యేకి ఇద్దరట..అనర్హత వేటు వెయ్యాలట...

0

ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణ మూర్తి ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డారు. ఆయన తాజా ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బలరాం ఎన్నికను సవాల్ చేస్తూ ఆమంచి హైకోర్టును ఆశ్రయించారు. బలరాం తన నామినేషన్ అఫిడవిట్‌లో వాస్తవాలు వెల్లడించలేదని ఆమంచి తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈరోజు మీడియాకు విడుదల చేశారు. కరణం బలరాంకి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారని.. అయితే.. అఫిడవిట్ లో మాత్రం ఒక్క భార్య గురించే పేర్కొన్నారని ఆమంచి ఆరోపించారు. ఆయనకు 1985లోనే కాట్రగడ్డ ప్రసూనతో వివాహం అయ్యిందని… వీరి వివాహం శ్రీశైలంలో జరిగిందని.. ఈ దంపతులకు 1989లో అంబిక కృష్ణ అనే అమ్మాయి హైదరాబాద్‌లోని సెయింట్ థెరిసా ఆసుపత్రిలో జన్మించిందని ఆమంచి తెలిపారు.

ఆమంచి చెపుతున్నట్టు ఈ దంపతుల కుమార్తె అంబిక పదో తరగతి సర్టిఫికెట్‌, తొలి అన్నప్రాసన, పుట్టినరోజు వేడుకల ఫొటోల్లో కూడా బలరాం ఉన్నారు. అంబికా తన కూతురు కాదని బలరాం ఏ పరీక్షకైనా సిద్దమా అని.. ఆమంచి సవాల్ విసిరారు. అటు అంబిక పై పరీక్షలకు సిద్ధంగా ఉందని.. ఇప్పుడు బలరాంకు ఈ పరీక్షలకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.