హైదరాబాద్ లో అమితాబ్ సందడి..ఫోటో వైరల్

0

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ హైదరాబాద్ లో సందడి చేశారు. ప్రాజెక్ట్​ కె షూటింగ్​లో భాగంగా  రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో ఆయన కనిపించారు. ఆయన్ను చూసేందుకు పలువురు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు.

దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.  ఈ ఫొటో షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. సాధారణంగా రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో మెట్రో స్టేషన్‌ మొత్తం ఖాళీగా, కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్రబృందంతోనే కనిపించిందని రాసుకొచ్చారు.

కాగా, ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here