అమ‌లాపాల్ ఇచ్చిన మాట త‌ప్పింది అందుకే ఆ ప‌ని చేశాం

అమ‌లాపాల్ ఇచ్చిన మాట త‌ప్పింది అందుకే ఆ ప‌ని చేశాం

0

అమ‌లాపాల్ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా తెలుగు త‌మిళ్ లో ఎన్నో చిత్రాలు చేసింది, న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కాని ఓ విష‌యం మాత్రం ఆమె గురించి పెద్ద చ‌ర్చ‌కు కార‌ణం అయింది, అదే ఆమె పెళ్లి విష‌యం. ఆనాడు అమ‌లాపాల్ త‌మిళ టాప్ ద‌ర్శ‌కుడు ఎల్ విజ‌య్ ని ప్రేమించింది, పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

కొంత‌కాలం బాగానే ఉన్న వారు ఆ తరువాత మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అందుకుగల కారణాన్ని గురించి విజయ్ తండ్రి అజగప్పన్ తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు
వారిద్ద‌రూ ప్రేమించుకున్నాం అని చెప్పారు.. మా రెండు కుటుంబాలు కూడా వారి ప్రేమ‌ని యాక్సెప్ట్ చేశాం.

వారికి పెళ్లి చేశాం, అయితే విజ‌య్ ముందు ఓ కండిష‌న్ పెట్టాడు.. పెళ్లి త‌ర్వాత ఇక సినిమాలు చేయ‌ద్దు అన్నాడు. అత‌నికి ఇష్టం లేదు ముందు ఆమె స‌రే అంది, కాని పెళ్లి అయిన కొంత కాలానికి సినిమాల‌కు సైన్ చేసింది.. ఆ తరువాత వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టింది. మేము చెప్పినా పుట్టింటివారు చెప్పినా ఆమె తన పద్ధతిని మార్చుకోలేదు.. దీంతో విజ‌య్ విడాకులు ఇచ్చాడు అని ఆయ‌న వెల్ల‌డించారు.