ఆనంద్ దేవరకొండ అదరగొట్టేశాడు.. ఆకట్టుకుంటున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్..?

ఆనంద్ దేవరకొండ అదరగొట్టేశాడు.. ఆకట్టుకుంటున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్..?

0

దొరసాని సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో ఆనంద్ దేవరకొండ.. అరంగేట్రం లోనే హిట్ కొట్టి, మంచి నటన కనపరిచి విమర్శకుల ప్రశంశలు సైతం పొందాడు.. తన రెండో ప్రయత్నంగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే సినిమా ను చేస్తున్నాడు.. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వెనిగళ్ల ఆనందప్రసాద్‌ నిర్మిస్తుండగా.. వినోద్‌ అనంతోజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పాటకు మంచి స్పందన లభించింది. ఈ పాటను దర్శకుడు క్రిష్ చేతులమీదుగా విడుదల చేశారు చిత్రయూనిట్. గుంటూరునగర విశిష్టతను వివరిస్తూ ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంటూ సాగింది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ కథ గుంటూరు నేపథ్యంలో సాగనుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తోంది. కాగా ఈ సినిమా ట్రైలర్ ను నేడు విజయ్ దేవరకొండ, రష్మిక లు కలిసి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మంచి క్లాస్ హిట్ కొట్టేలా ఉంది.. తండ్రి కొడుకులమధ్య మంచి ఫన్నీ సన్నివేశాలు ఉన్నాయనిపిస్తోంది.కొడుకు పెట్టె బొంబై చట్నీ ఫేమస్ అవ్వడంతో తను కూడా సెపరేట్ హోటల్ పెట్టాలని డిసైడ్ అయిన హీరో గుంటూరు వెళ్లి అక్కడ సెపరేట్ హోటల్ పెట్టడానికి పడే కష్టం, పెట్టిన తర్వాత ఎదురైన పరిస్థితులు లాంటివి ట్రైలర్ లో ఎంటర్ టైన్ మెంట్ వే లో ఆకట్టుకునేలా చూపెట్టారు.

హీరో ఫాదర్ రోల్ ఆవేశంతో మాట్లాడే మాటలు కామెడీగా ఉండగా హీరోయిన్ క్యూట్ లుక్స్ తో మెప్పించింది, కొంచం ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో ట్రైలర్ చాలా వరకు మెప్పించింది అని చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్లజెంట్ గా అనిపించింది. మొత్తం మీద ట్రైలర్ ఆకట్టుకోగా ఇప్పుడు సినిమా పై మినిమమ్ అంచనాలు పెరిగేలా చేసింది ఈ ట్రైలర్. ఈ నెల 20 న డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న మిడిల్ క్లాస్ మెలొడీస్ ట్రైలర్ వరకు ఆకట్టుకుని సినిమా పై కొంచం ఎక్స్ పెర్టేషన్స్ అయితే పెంచగలిగింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here