హైదరాబాద్‌లో పెప్పర్‌ టీ కేఫ్‌ను ప్రారంభించిన యాంకర్ సుమ

రాబోయే రెండేళ్లలో  దాదాపు 200 ఔట్‌లెట్లను ప్రారంభించనున్న పెప్పర్‌ టీ

0

అత్యుత్తమ కేఫ్‌ విశ్రాంత అనుభవాలను అందించేందుకు హైదరాబాద్‌  కేంద్రంగా కలిగిన నియోమా ఫుడ్స్‌ తమ  పెప్పర్‌ టీ కేఫ్‌లను ప్రారంభించింది.  సంప్రదాయ ఇండియన్‌ ఛాయ్‌ను ఎన్నో రుచులలో  స్వచ్ఛమైన మరియు ఫ్యూచరిస్టిక్‌ ప్రాంగణాలలో అందించే రీతిలో  పెప్పర్‌ టీ కేఫ్‌  నేపథ్యీకరించారు. అన్ని రకాల వయసు తరగతుల వారినీ ఆకట్టుకునే రీతిలో మెనూ తీర్చిదిద్దారు. ఇది విభిన్న రకాల వంటకాలు,  ఏ సమయంలో అయినా ఆస్వాదించ తగిన రీతిలో పసందైన స్నాక్స్‌ సమాహారంలా ఉంటుంది. ఈ కేఫ్‌ నేపథ్యం టీ,  ఫుడ్‌ , లీజర్‌ను వేడుక చేసే వాతావరణంలో భోజన ప్రేమికుల అవసరాలు, కోరికలు తీర్చే రీతిలో ఉంటుంది.

ఈ  కేఫ్‌ తమ మొట్టమొదటి ఔట్‌లెట్‌ను నేడు  హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ప్రారంభించింది. ప్రతి ఒక్కరూ ఎంతో అభిమానించే సుప్రసిద్ధ టీవీ హోస్ట్‌ సుమ కనకాల ఈ కేఫ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కేఫ్‌లో అత్యంత ఆసక్తికరమైన, రంగవల్లులతో కూడిన మరియు అనుసంధానిత నేపథ్యం ఉంటుంది. కేఫ్‌లో అడుగుపెట్టగానే మీలో ఉన్న విసుగు, చికాకును దూరం చేసే రీతిలో ఈ వాతావరణం ఉంటుంది.

హైదరాబాద్‌లో మొట్టమొదటి పెప్పర్‌ టీ కేఫ్‌ను ప్రారంభించిన అనంతరం  సుమ కనకాల మాట్లాడుతూ ‘‘నిజాం సమయంలో, టీ, కాఫీలు ఉన్నత వర్గాల ప్రజలలో మాత్రమే సాధారణంగా కనిపిస్తుండేవి.  అప్పటి నుంచి ఈ నగరంలో  అసంఖ్యాక ఇరానీ కేఫ్‌లు, కాఫీ డేస్‌ రావడంతో ఎంతో మారింది. నూతన, ఆసక్తికరమైన విశ్రాంత, గ్యాస్ట్రోనమీ సంస్కృతులను ప్రయత్నించడమనేది నగరంలో నూతన అంశం ఏమీ కాదు.  నూతన ఉత్పత్తులు మరియు ప్రాంగణాలు పరిచయం చేయడంతో, ఈ నగరం ఇప్పుడు అత్యంత సున్నితమైన,  ఎక్సోటిక్‌ టీ, స్నాక్స్‌కు కూడా నిలయంగా మారింది.  హైదరాబాద్‌తో పాటుగా దేశవ్యాప్తంగా  పెప్పర్‌ టీ కేఫ్‌లు అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాంగవుట్‌ స్పాట్స్‌గా మారతాయని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

పెప్పర్‌ టీ కేఫ్‌  బ్రాండ్‌ రూపకల్పనలో  కో–ఫౌండర్లు  రామకృష్ణరాజు మరియు లక్ష్మీ చాపరాల  అనన్యసామాన్యమైన రీతిలో కష్టపడ్డారు. రామకృష్ణ రాజు యొక్క ఖచ్చితత్త్వంతో కూడిన పరిశోధన కారణంగా హైదరాబాద్‌ నగరంలో  అత్యంత ఆసక్తికరమైన, సృజనాత్మకంగా తీర్చిదిద్దిన మెనూ, అద్భుతమైన రుచులు అందుబాటులోకి వచ్చాయి.  ఆయన పరిశోధనలో  ఆవిష్కృతమైన ఓ వినూత్నమైన ఉత్పత్తి  బెల్లం పెప్పర్‌ టీ (జాగరీ పెప్పర్‌ టీ). హైదరాబాద్‌లో ఇది మొట్టమొదటిసారిగా లభ్యమవుతుంది. ఈ బ్రాండ్‌ యొక్క పేరు ఈ వైవిధ్యమైన టీ కారణంగానే వచ్చింది.  అసంఖ్యాక ఫుడ్‌ ట్రయల్స్‌ను  రాజు నిర్వహించడంతో పాటుగా ప్రతి వయసు గ్రూప్‌లోనూ  వైవిధ్యమైన రుచులకు తగినట్లుగా దీనిని తీర్చిదిద్దారు.

‘‘వ్యాపార కోణంలో చూస్తే, యువ ఔత్సాహికులకు ఇది అత్యుత్తమ అవకాశంగా నిలుస్తుంది. కేవలం 7 లక్షల రూపాయల పెట్టుబడితో యూనిట్‌ను 20 లక్షల పెట్టుబడితో మాస్టర్‌గా ఫ్రాంచైజీకి నిలువవచ్చు. పెట్టుబడిపై పెట్టిన రాబడులు కూడా బాగుంటాయి. చెఫ్‌లకు శిక్షణ, నిర్వహణ , మార్కెటింగ్‌ పరంగా బ్రాండ్‌ పూర్తి మద్దతునందిస్తుంది.  ఉత్పత్తి యొక్క వైవిధ్యత మరియు ధరలు కారణంగా ఈ బ్రాండ్‌ ప్రజలలోకి చొచ్చుకుపోవడంతో పాటుగా ఎంతోమంది వినియోగదారులు మా అభిమానులుగా మారనున్నారు’’ అని లక్ష్మీ చాపరాల అన్నారు.

‘‘రాబోయే కొద్ది సంవత్సరాలలో  200 స్టోర్లను ప్రారంభించడానికి మేము ప్రణాళిక చేశాము. తద్వారా ఈ బ్రాండ్‌ను ప్రధానమైన మెట్రోలు, నగరాలకు  విస్తరించనున్నాము. మేము మిగిలిన బ్రాండ్లకు ఏ విధంగా వినూత్నం ? అంటే  మీరు కోరుకునే గుడీస్‌ అన్నీ ఒకే చోట లభిస్తాయి.  చక్కటి ఆహారం , అందుబాటులో ధరలు, సంతోషకరమైన వాతావరణం, అత్యద్భుతమైన మెనూ ! ఇలా అన్నీ ఇక్కడ ఉంటాయి ! మరియు టీ  మరియు విశ్రాంత అనుభవాల పట్ల మీ ప్రేమ దీనిని అనుసరిస్తూనే ఉంటుంది !’’ అని ఆమె మరింతగా వెల్లడించారు.

ఈ కేఫ్‌, అత్యుత్తమ నాణ్యత మరియు పరిశుభ్రతను అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంది.  ఈ ఔట్‌లెట్లు ఖచ్చితంగా క్రమం తప్పకుండా  శానిటేషన్‌ చేయబడటంతో పాటుగా  ఆరోగ్యవంతమైన రీతిలో ఆహార నిర్వహణ, వేడి, తాజా ఆహారం మాత్రమే అందించడం జరుగుతుంది.

అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దిన మెనూలో  ప్రత్యేకంగా రూపొందించిన టీలు,  క్విక్‌ బైట్స్‌, రుచికరమైన ఫిల్లింగ్స్‌తో శాండ్‌ విచ్‌లు, క్రంాచీ సాఫ్ట్‌ బర్గర్‌లు, హ్యాపీ షేక్స్‌ వంటివెన్నో ఇక్కడ  లభించడంతో పాటుగా తియ్యటి డెసర్ట్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి.  అత్యంత వేగంగా, అతి తక్కువ నిరీక్షణ సమయంతో మెనూ అందించే రీతిలో తమ మెనూను పెప్పర్‌ టీ తీర్చిదిద్దింది.

ఓ బ్రాండ్‌గా మదుపరులు,  ఫ్రాంచైజీ వ్యాపార నమూనాల పట్ల అమితాసక్తిని  కనబరిచే వ్యక్తులు ఎదిగేందుకు ఓ ఆపర్ట్యుని ‘టీ’ని  పెప్పర్‌టీ అందించాలని కోరుకుంటుంది. టీ మరియు కేఫ్‌ వ్యాపారాల పట్ల  బ్రాండ్‌ యొక్క లక్ష్యంతో, కేఫ్‌ వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్న యువ వ్యాపారవేత్తలకు ప్రాఫిటబిలి‘టీ’ని అందించడాన్ని బ్రాండ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here