ఎపి కోవిడ్ బులిటెన్ రిలీజ్, తగ్గిన కేసులు : ఇవాళ లిస్ట్ ఇదే, ఆ ఒక్క జిల్లాలో డబుల్ డిజిట్

0

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా తగ్గిపోతూ జనాలకు ఊరట కలుగుతోంది. మంగళవారం నాడు 4169 కేసులు నమోదయ్యాయి. మొత్తం 74453 నమూనా పరీక్షలు నిర్వహించారు. పాజిటీవ్ రేట్ 5.6శాతంగా ఉంది. నేడు మరణాల సంఖ్య 53 గా నమోదైంది. చిత్తూరు జిల్లాలో ఏడుగురు మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 743 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 53880 ఉన్నాయి.  గడిచిన 24 గంటలలో రికవరీ అయిన వారి సంఖ్య 8376. ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 12416 గా నమైంది. 18.57 లక్షల్లో 17.91 లక్షల మంది రికవరీ అయ్యారు.

మరణాలు చూస్తే… చిత్తూరులో 7, తూర్పు గోదావరిలో 6, ప్రకాశంలో 6, కృష్ణా జిల్లాలో 5, శ్రీకాకుళంలో 5, అనంతపురంలో 4, నెల్లూరు 4, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరిలో 3, గుంటూరు లో 2, కర్నూలులో 2, విజయనగరంలో 2 చొప్పున మరణాల సంఖ్య నమోదైంది.

అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…

అనంతపూర్ 264
చిత్తూరు 472
తూర్పుగోదావరి 743
గుంటూరు 273
వైఎస్సార్ కడప 160
కృష్ణా 368
కర్నూలు 126
నెల్లూరు 236
ప్రకాశం 357
శ్రీకాకుళం 180
విశాఖపట్నం 251
విజయనగరం 80
పశ్చిమ గోదావరి 659

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here