అందుకే చనిపోతున్నా భార్యకు మెసేజ్ ఆస్తి నువ్వే తీసుకో

అందుకే చనిపోతున్నా భార్యకు మెసేజ్ ఆస్తి నువ్వే తీసుకో

0

అతను ఓ ఇంజనీర్ మంచి జీతం , అయితే జీవితం మాత్రం బాగా చేసుకోలేకపోతున్నాడు, దానికి పలు కారణాలు ఉన్నాయి, అయితే ముందు తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి పెళ్లి చేశారు, ఆమె పద్దతి నచ్చక విడాకులు తీసుకున్నాడు, తర్వాత సంవత్సరానిక ఓ యువతిని ఫ్రెండ్ పెళ్లిలో చూసి ఆమెని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఆమె ఇతని మూర్ఖత్వానికి తట్టుకోలేక విడాకులు ఇచ్చింది, ఇక తల్లిదండ్రులు వయసు అయిపోవడంతో నీకు తోడు ఉండాలి బిడ్డా అని మూడో వివాహం గత ఏడాది చేశారు, అయితే వీరిద్దరిని ఎందుకు వదిలేశావు, నువ్వు మంచివాడివి కాదా, అందుకే వారు వదిలేశారా అని మూడో భార్య టార్చర్ పెట్టేది.

ఇలా వీరిద్దరికి తరచూ గొడవలు జరిగేవి, అయితే వారిద్దరూ విడిపోవడానికి నేను కారణం కాదు, నిన్ను పెళ్లి చేసుకున్నాక అసలు నాకు ఆనందం దూరం అయింది, నా తల్లి పేరు మీద ఉన్న ఆస్తి నువ్వు తీసుకో నిన్ను బాగా చూసుకునే వాడిని పెళ్లి చేసుకో అని పురుగుల మందు తాగాడు, ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు, దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. కాస్త కూడా ఆలోచన లేకుండా ఇలా బలవన్మరణాలకు పాల్పడేవారు కాస్త ఆలోచించాలి అని చెబుతున్నారు వైద్యులు పోలీసులు. చిన్న చిన్న వివాదాలకు ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదు అంటున్నారు.