అందుకే నన్ను టార్గెట్ చేశారు సంచలన విషయం చెప్పిన- పృథ్వీరాజ్

అందుకే నన్ను టార్గెట్ చేశారు సంచలన విషయం చెప్పిన- పృథ్వీరాజ్

0

సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ రాజధాని రైతుల పై చేసిన కామెంట్లు, రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని సంభోధించడం ఇటు వైసీపీలో కూడా కొందరికి నచ్చలేదు. జగన్ ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకుంటే, పార్టీలో నాయకులు ఇలాంటి కామెంట్లు చేయడం ప్రజలను మరింత దూరం చేసేలా ఉన్నాయి అని అంటున్నారు పార్టీలో కొందరు.

తాజాగా వైసీపీ నాయకుడు రచయిత నటుడు పోసాని మురళి పృథ్వీరాజ్ పై తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అమరావతి రైతులని ఇలా అనడం తప్పు అని వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలి అని విమర్శలు చేశారు, అయితే దీనిపై స్పందించిన , పృథ్వీ ఏమాత్రం తగ్గడం లేదు. పోసానికి తాజాగా కౌంటర్ ఇచ్చారు.

వైసీపీలో పోసాని కంటే తానే సీనియర్ అని అన్నారు. ఆయన సామాజికవర్గాన్ని అన్నందుకే తనను టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఉన్నది రైతులు కాదని… రైతుల ముసుగులో ఉన్న రౌడీలు, గూండాలు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అదే వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇది పెనుదుమారం అయింది, ఆయన కులం పేరు ఎత్తి వారిని అన్నాను అని తనని అంటున్నారని, కేవలం కులం కోసం తనని టార్గెట్ చేశారు అని విమర్శించారు…రైతులకు తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికీ తన స్టాండ్ ఇదేనని.. అక్కడ ఆందోళన చేస్తున్నవారు పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు. సో మరి దీనిపై పోసాని ఏమంటారో చూడాలి.