చినబాబు, పెదబాబును కడిగిపాడేసిన అనిల్

చినబాబు, పెదబాబును కడిగిపాడేసిన అనిల్

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఆయన కుమారుడు నారాలోకేశ్ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు….

లోకేశ్ వాస్తవాలు తెలియకుండా ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు… ధైర్యంగా ఎదుర్కోలేక పెయిడ్ ఆర్టిస్టల ద్వారా విమర్శలు చేస్తున్నారని అనిల్ ద్వజమెత్తారు… తాజాగాఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కొద్దికాలంగా యాదవులను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు…

ఎప్పటినుంచో చంద్రబాబు నాయుడు యాదవులు పాలను అమ్ముకుంటూ హెరిటేజ్ సంస్థ ద్వారా కోట్లను సంపాదించుకున్నారని అనిల్ అన్నారు… జగన్ గతంలో ఎన్నడులేని విధంగా యాదవులకు ప్రధమ స్థానం ఇస్తుంటే చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని అన్నారు