బుల్లెట్‌ దిగిందా లేదా?: అనిల్‌

బుల్లెట్‌ దిగిందా లేదా?: అనిల్‌

0

ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. రైతులకు సున్నా వడ్డీ పథకంపై సీఎం జగన్ సవాల్ విసిరారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలంటూ మంత్రి అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మేం అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా? అంటూ వ్యాఖ్యానించారు.