ఆనం కామెంట్స్ పై అనిల్ రియాక్షన్ అదుర్స్

ఆనం కామెంట్స్ పై అనిల్ రియాక్షన్ అదుర్స్

0

వెంకటగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవలే సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగితి తెలిసిందే… స్వచ్చమైన తేనె కావాలంటే వెంటగిరికి రావాలని… ఏ ఇతర మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లండని అంటూ నెల్లూరు జిల్లాలో ప్రాతినిత్యం వహిస్తున్న అనిల్ అలాగే శ్రీధర్ రెడ్డిలని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు…

దీనిపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది… ఇక తాజాగా మంత్రి అనిల్ కూడా స్పందించారు… నెల్లూరులో మాఫియా పెరిగిందని గత ప్రభుత్వం గురించి ఆనం అని ఉంటారని వ్యాఖ్యానించారు… నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు…

పార్టీలో అంతర్గత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడటం తగదని అనిల్ హెచ్చరించారు… తమకు ఒకరే నేత అని అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు… కాగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ఆనం టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే…