గాన కోకిల కు మరో అరుదైన అవార్డు..!

గాన కోకిల కు మరో అరుదైన అవార్డు..!

0

ప్రముఖ గాయని గానకోకిల పి. సుశీలను మరో ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల నేషనల్ అవార్డు వరించింది. సుశీల సినిమా పాటలతో పాటు భక్తి గీతాలు కూడా పాడారు. ఆమె గానం వింటే కోకిల వచ్చిపడింది అనంత తీయగా ఉంటుంది. తెలుగు హిందీ మలయాళం తమిళం కన్నడ భాషల్లో ఆమె అనేక పాటలు పాడారు ఇప్పటికే ఆమె ఖాతాలో పద్మభూషణ్ రఘుపతి వెంకయ్య అవార్డు స్వరాలయ ఏసుదాస్ పురస్కారాలు వచ్చాయి. గానకోకిల సుశీల కి ఇది నాలుగో పురస్కారం ఇవే కాకుండా సుశీల గారికి గానకోకిల గాన సరస్వతి అనే బిరుదులు కూడా ఉన్నాయి.

నేడు వైజాగ్ కళాభారతి ఆడిటోరియంలో జరిగే కొప్పరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవం లో అతిరథమహారథులు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు ఈ కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంద భారతీయ స్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం బిజెపి నేత మురళీధర్ రావు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు హాజరవుతున్నారు