సంచలనం ఏపీలో మళ్లీ ఎన్నికలు

సంచలనం ఏపీలో మళ్లీ ఎన్నికలు

0

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మళ్లీ ఎన్నికలు జరుగనున్నాయి… ఈ మధ్యనే ఏపీ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు అఖండవిజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినట్లు సమాచారం అందుతోంది.

ఎన్నికలు జరిగే ఒక నెల ముందు అంటే నవంబర్ నెలలో ఎన్నికల కార్యచరణ ఉంటుందని అన్నారు. ఆ తర్వాత డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

వాస్తవానికి ఈ ఎన్నికలు ఏడాది క్రితం జరిగిపోవాలి కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికలు ఎందుకు అని ఈ ఎన్నికలు పోస్ట్ పోన్ చేశారు…. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అన్నారు.