బ్రేకింగ్ వైసీపీలోకి జనసేన కీలక నేత… షాక్ లో పవన్

బ్రేకింగ్ వైసీపీలోకి జనసేన కీలక నేత... షాక్ లో పవన్

0

2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కున్న జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది… 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేత పక్క చూపులు చూస్తున్నారు..

జనసేన పార్టీ తరపున పాడేరు నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓటమి చెందిన పసుపులేటి బాలరాజు త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోవాలని చూస్తున్నారట. అందుకు తగిన ఏర్పాట్లను కూడా ఆయన సిద్దం చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం…

అయితే ఆయన వైసీపీలో చేరికను అధిష్టానం ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ పాడేరుకు చెందిన ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం ఆహ్వానిస్తోంది… పసుపులేటీ వైసీపీలో చేరితే పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని కొందరు…

లేదు చేరితే రానున్న రోజుల్లో పాడేరులో వైసీపీకి మరింత బలం చేకూరుతుందని మరికొందరు అంటున్నారు… మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.