టీఆర్ఎస్ కు మరో షాక్..నిన్న కార్పొరేటర్..నేడు మాజీ ఎమ్మెల్యే

0

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇదే జరిగితే తెరాసకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.

”ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస పార్టీ పరిస్థితి బాగొలేదు. అశ్వరావుపేట తెరాస ఇన్‌ఛార్జ్‌గా కేటీఆర్ నన్ను ప్రకటించినప్పటికీ.. ఎవరూ నన్ను గుర్తించట్లేదు. రాజకీయంగా నన్ను అణగదొక్కే శక్తులు తెరాసలోనే ఉన్నాయి. నా కుమార్తె చనిపోతే కూడా.. పార్టీలో నేతలు పరామర్శించలేదు. తెరాస అధిష్ఠానం ఇకనైనా గుర్తించి నాకు పార్టీలో గుర్తింపు ఇవ్వాలి. వచ్చే ఎన్నికల్లో అశ్వరావుపేట నుంచే బరిలోకి దిగుతా.. నాలాగే మరెంతో మందికి తెరాస పార్టీలో అవమానం జరుగుతోంది. అధిష్ఠానం ఈ విషయాన్ని గుర్తించి.. ప్రాధాన్యతనివ్వాలి. అధిష్ఠానం స్పందించకపోతే పార్టీని వీడతా.’

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here