ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా దొరికిపోయిన అనుష్క, ప్రభాస్..!!

ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా దొరికిపోయిన అనుష్క, ప్రభాస్..!!

0

టాలీవుడ్ లో ప్రేమ జంటలు చాలానే ఉన్నాయి.. అందులో కొన్ని పెళ్లి చేసుకుంటే కొంతమంది పెళ్లి చేసుకోలేదు.. మొన్న సమంత , నాగచైతన్య లు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేడు ప్రభాస్ , అనుష్క లు కూడా అదే బాటలో నడవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వారు వాటిని కొట్టిపారేసిన రూమర్స్ ఇంకా వాతూనే ఉన్నాయి..

ఇదిలా ఉంటె ‘నిశ్శబ్దం’ అనే చిత్రం చేస్తూ అనుష్క చాలా బిజీగా గడుపుతుంది. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రభాస్ అనుష్క వీరిద్దరూ తాజాగా ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. లండన్ లోని ‘రాయల్ ఆల్బర్ట్ హాల్’ లో ‘బాహుబలి’ స్క్రీనింగ్ కోసం వీరిద్దరూ ప్రయాణమై వెళ్తుండగా ఈ ఫోటోలు తీసినట్టు తెలిస్తుంది. ‘బ్లాక్ ఔట్ ఫిట్స్’ లో వీరిద్దరూ యమ స్టైలిష్ గా ఉన్నారు. మొన్నటికి మొన్న కాస్త లావైనట్టు కనిపించిన అనుష్క ఈ ఫొటోల్లో సన్నగా కనిపిస్తుంది. ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా కనిపించి అలరించింది అనుష్క. ఇక వీరిద్దరి ఎయిర్ పోర్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.