జగనన్న ‘‘గిచ్చుడు’’ పథకం కూడా పెట్టుకోండి

0

ఆంధ్రప్రదేశ్ బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు జివియల్ నరసింహారావు సిఎం జగన్మోహన్ రెడ్డి మీద మండిపడ్డారు. జగనన్న గిచ్చుడు పథకం, జగనన్న బాదుడు పథకం కూడా ప్రవేశపెట్టుకోండి అని ఆయన ఎద్దేవా చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే…

కేంద్ర ప్రభుత్వం ఎక్కడా పన్నుల పెంపుపై ఆదేశాలు ఇవ్వలేదు. అలాగయితే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలికదా?  బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో ఆస్థి పన్నులు పెంచలేదు. అప్పులు తీర్చుకొనేందుకు పన్నులు పెంచి కేంద్రంపై నింద మోపుతారా? కేంద్రానికి పన్నుల పెంపునకు సంబంధం లేదు. పన్నుల భారంతో ఆర్జన మీకు, అపనింద కేంద్రానిదా?  కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలన్నింటికీ మీ స్టికర్లు వేసుకొని, పన్నుల నిర్ణయాన్ని కేంద్రానికి ఆపాదిస్తారా? ఇది ఎంత మోసం? అప్పులు చేసి పన్నులు వేసేది ఏపీ ప్రభుత్వం. అపవాదులు కేంద్ర ప్రభుత్వానికా? పన్నుల పెంపునకు కూడా “జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం” అని పేరు పెట్టుకోండి. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు  రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంత కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే జరుగుతున్నది.

నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టు కింద ఏపీకి 8.16లక్షల కోట్ల నిధులు పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ కింద ఏపీకి నిధులు ఇచ్చాము. పియమ్ఏవై కింద రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే జగనన్న కాలనీలు అని మీ పేరు పెట్టుకొని  ప్రచారం చేసుకుంటారా? పన్నుల పేరుతో కరోనా కష్ట కాలంలో ప్రజలపై  భారాలు మోపుతారా? పన్నులు మీరు పెంచుతూ నెపం బీజేపీపై నెడతారా. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పెంచుతూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ఈ నిరసనను తీవ్రతరం చేసి ప్రజల సహాయ నిరాకరణ కార్యక్రమంగా చెప్పటం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here