ఏపీ కరోనా బులెటిన్ రిలీజ్..కొత్తగా ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..!

AP Corona Bulletin Release..how many new positive cases ..!

0

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం కలుగుతుంది.

తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,816 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,528 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో నిన్న ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 418 కోలుకోగా, ప్రస్తుతం 18,318 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  327

చిత్తూరు         1027

ఈస్ట్ గోదావరి   327

గుంటూరు 377

వైస్సార్ కడప 236

కృష్ణ   166

కర్నూల్  164

నెల్లూరు   229

ప్రకాశం    142

శ్రీకాకుళం 385

విశాఖపట్నం  992

విజయవాడ   121

వెస్ట్ గోదావరి   62

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here