ఏపీలో జగన్ గ్రాఫ్ పడిపోయిందా….

ఏపీలో జగన్ గ్రాఫ్ పడిపోయిందా....

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందా అంటే అవుననే అంటున్నారు మాజీ టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ అభద్రతాభావంతో ప్రజల్లో వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు…

మంత్రులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తిడితే వారికి పేరు వస్తుందని అనుకుంటున్నారని ఉమా ఆరోపించారు… కానీ పాలన వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు మంత్రులు బూతులు తిడుతున్నారని ఉమా అన్నారు….

వైసీపీ చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకున్నాయని మండిపడ్డారు… పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ గల్లా తన వాయిస్ ను వినిపిస్తుంటే అడ్డుతగిలారని దాని బట్టి చూస్తుంటే వైసీపీ ఎంపీలు ఎంత దిగాజారిపోయారో అర్థం అవుతుందని ఉమా అన్నారు…