ఏపీ మూడు రాజధానులపై కేంద్రం ఫుల్ క్లారిటీ….

ఏపీ మూడు రాజధానులపై కేంద్రం ఫుల్ క్లారిటీ....

0

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజు రోజుకు వేడెక్కుతోంది… రాజధాని పేరుతో టీడీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి అక్రమంగా భూములు కొన్నారని విమర్శలు చేస్తోంది… అంతేకాదు రాజధానిలో ఎవరెవరు ఎన్ని ఎకరాలు కొన్నారో ప్రజెంటేషన్ ద్వారా వివరించింది…

ఇక దీనిపై స్పందించిన టీడీపీ నాయకులు అమరావతి రాజధానిని మార్చేందుకు వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తోంది… ఇక ఏపీ బీజేపీ నాయకులు మాత్రం ద్వంద వైఖని వినిపిస్తున్నారు…

ఈనేధ్యంలో కేంద్ర మంత్రి ఫుల్ క్లారిటీ ఇచ్చారు… రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు… రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తాను స్పందిస్తామని అన్నారు… పత్రికల్లో వస్తోన్న కథనాల ఆధారంగా కేంద్రం స్పందించదన్నారు కిషన్ రెడ్డి…